రఘు బాబు ఈ పోస్టర్లో ఆగ్రహంగా కనిపిస్తున్నారు. చూస్తుంటే ఏదో యాక్షన్ సీన్ కి రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్‌ను, రుద్రుడిగా ప్రభాస్‌ను, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సంసిద్దం అవుతోంది. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు.