శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను ఆధారంగా చేసుకుని విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.