బలవంతంగా ఆ పనులు చేయించారు : రాజ్ కుంద్రాపై గహానా వశిష్ట్

గురువారం, 29 జులై 2021 (15:23 IST)
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా ఇపుడు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే అడల్డ్ కంటెంట్‌ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా అనేకమంది సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ నటి గహానా వశిష్ట్ సంచలన ఆరోపణలు చేశారు. హాట్ షాట్స్ యాప్ కోసం తనతో బలవంతంగా పోర్న్ వీడియోలు చేయించారని ఆరోపించారు. 
 
ఇప్పటికే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆయన ఉద్యోగులే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఇవ్వగా.. తాజాగా ముంబై‌కి చెందిన ఒక నటి హాట్‌షాట్స్‌ కోసం తనతో బలవంతంగా పోర్న్‌ వీడియోలు చేయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. 
 
దీంతో నటి గహనా వశిష్ఠ్‌తోపాటు రాజ్‌కుంద్రా సంస్థకు చెందిన నలుగురిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇక పోర్న్ సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే నటి గహానా వశిష్ఠ్ జైలుకెళ్లి వచ్చారు. 
 
ఫిబ్రవరి‌లో గహనా వశిష్ఠ్‌ సహా 10 మందిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాదాపు 5 నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు