రాజ్‌త‌రుణ్‌ - రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లో 'అందగాడు'...

బుధవారం, 16 నవంబరు 2016 (16:23 IST)
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.10గా కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'అందగాడు'. ఇటీవ‌ల సినిమా లాంఛనంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. 
 
డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం గ్యాప్ లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ హీరో రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్ మంచి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించారు. ఇప్పుడు అదే కోవలో మ‌రోసారి రాజ్‌త‌రుణ్ క‌థానాయ‌కుడుగా వెలిగొండ శ్రీనివాస్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అందగాడు. డిఫ‌రెంట్, స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. క‌థ విన‌గానే రాజ్ త‌రుణ్ సినిమా చేయ‌డానికి వెంట‌నే అంగీక‌రించారు. 
 
'కుమారి 21ఎఫ్'‌, 'ఈడోర‌కం-ఆడోర‌కం' హిట్ చిత్రాల త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జోడి న‌టిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. అలాగే రైట‌ర్ వెలిగొండ శ్రీనివాస్‌ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్న సినిమా కూడా అందగాడు కావ‌డం విశేషం. సినిమా ప్రారంభ‌మైన రోజు నుండి ఏ గ్యాప్ లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను వ‌చ్చే యేడాది వేస‌వి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా బాగా వ‌స్తుంది. మంచి టీం కుదిరింది. క‌థ ప‌రంగా సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నాం. సినిమా త‌ప్ప‌కుండా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా ఉంటుంది' అన్నారు. 

వెబ్దునియా పై చదవండి