టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని సూరారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు.. కోకాపేటలోని రాజ్‌తరుణ్ ఇంటికి వచ్చారు. అయితే, ఈ ఇంట్లో ఉంటున్న లావణ్య.. వారిని ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంది. ఈ ఇంటిలో తనకు కూడా వాటా వుందని వాదిస్తోంది. పైగా, కోర్టులో కేసు ఉందని అందువల్ల ఇంట్లోకి రావడం కుదరదని తెగేసి చెప్పింది. అంతగా ఇంట్లోకి రావాలనుకుంటే పోలీసులతో మాట్లాడి తర్వాత రావాలని చెప్పారు. దీంతో వారు సాయంత్రం వరకు అక్కడే కూర్చుండిపోయారు.
దీనిపై లావణ్య స్పందిస్తూ, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమపై దాడికి వచ్చారని ఆరోపించారు. ఈ ఇంటిని తాను, రాజ్ తరుణ్ కలిసి కొన్నామని, తాను రూ.70 లక్షలు ఇచ్చానని చెప్పారు. ఇపుడు వారి తల్లిదండ్రులు వచ్చి ఆ ఇల్లు తమదని అంటున్నారని పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు హక్కు ఉందన్నారు. తాము ఆ ఇంటిని కొన్నపుడు రూ.1.5 కోట్లు అని, ఇపుడు రూ.12 కోట్లుగా ఉందన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టరని ఆరోపించారు.
ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన కొరియోగ్రాఫర్ శేఖర్ బాషా అక్కడకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు.