పవన్ సాదినేని ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు, గ్యాంగ్స్టర్ల మధ్య ఇరుక్కున్న మాన్స్టర్ కథ ఇది. ఈరోజు ముహూర్తం కార్యక్రమంతో లాంచైన ఈ సినిమాలో రాజశేఖర్ ఓ మాన్స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
హీరో రాజశేఖర్, బెక్కెం వేణు గోపాల్, శివకుమార్‌లతో కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. దామోధర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ కలిసి కెమెరా స్విచాన్ చేయగా, ప్రవీణ్ సత్తారు క్లాప్‌బోర్డ్‌ను కొట్టారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి ఎమ్ జిబ్రాన్ సంగీతం అందించగా, వివేక్ కాలేపు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్‌గా పని చేస్తుండగా, రాకేందు మౌళి డైలాగ్స్ రాస్తున్నారు. హుస్సేన్ ష కిరణ్, వసంత్ జుర్రు అదనపు స్క్రీన్ ప్లేని అందించారు. శ్రీనివాస్ నారిని ప్రొడక్షన్ డిజైనర్.