ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. మా మీద నమ్మకం ఉంచి పెద్దన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజినీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ పెద్దన్న సినిమా అన్నాత్తెకు డబ్బింగ్‌గా రాబోతోంది. మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తరువాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. ఈ చిత్రంలో మనకు వింటేజ్ రజినీకాంత్ గారు కనిపిస్తున్నారు. మనం ఎలా అయితే రజినీకాంత్‌ను చూడాలని అనుంటామో అలానే దర్శకుడు శివ చూపించారు. ఇందులో ఎమోషన్ కూడా ఉంది. అన్నాచెల్లెళ్ల బంధం అద్భుతంగా ఉంది.
జగపతి బాబు, కుష్బూ, మీనా, నయనతార ఇలా అందరూ చక్కగా నటించారు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా. క్లాస్ మాస్ ఫ్యామిలీ అందరూ చూడగలిగే సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇకపై కూడా మేం కలిసే సినిమాలు చేస్తాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మాకు నచ్చిన చిత్రాలను కలిసే విడుదల చేస్తాం. ఈ సినిమా కథను శివ నాకు చెప్పాడు. ఇలాంటి సమయంలో కమర్షియల్ చిత్రమైతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులభం అవుతుంది. కరోనా పట్ల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ మన డైలీ రొటీన్ జీవితాన్ని మాత్రం ఆపకూడదు. దీపావళికి పెద్దన్న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామఅని అన్నారు.