తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈమె అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో నటిస్తూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తికేయన్‌తో ఈ భామ అయలాన్ అనే చిత్రంలో నటించగా, ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది.
మరోవైపు, బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్ ప్రీత్ పేరు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు కూడా ఆమె హాజరైంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు తనకు లేదని విచారణలో ఆమె తెలిపింది. అయినప్పటికీ ఆమె ఈ కేసు నుంచి పూర్తిగా ఇంకా బయటపడలేదు.