బంపర్ ఆఫర్: అమితాబ్ బచ్చన్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్..

గురువారం, 19 నవంబరు 2020 (11:57 IST)
''కెరటం'' సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోల సరసన నటించింది. 'లౌక్యం', 'నాన్నకు ప్రేమతో', 'ధృవ' వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. 
 
ఇక ఇటీవల బాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. అందులో భాగంగా ఈ భామకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. 
 
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో 'మేడే' అనే చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంతో చాలా సంవత్సరాల తరువాత సీనియర్ స్టార్ అమితాబ్, అజయ్‌లు కలిసి పనిచేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్.. అజయ్‌కు కో పైలట్ పాత్రలో నటిస్తుందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు