టాలీవుడ్‌లో ఎముకలు లేని హీరోలు.. అంతా అనుష్క చుట్టూనే

గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:04 IST)
గత కొంతకాలంగా జోరు తగ్గిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో దాదాపు యువ హీరోలందరితో నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో 'మన్మథుడు-2'తో పాటుగా తమిళ, హిందీ భాషల్లో మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న "దే దే ప్యార్ దే" సినిమాలో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కొన్ని సందర్భాలలో పురుషాధిక్యతపై హీరోయిన్లు స్పందిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే ఆరోపణపై తన భావాలను తెలియపరిచింది. కేవలం కొన్ని సంఘటనలను బట్టి అన్నిచోట్లా పురుషాధిక్యత ఉందని భావించవద్దు. 
 
ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండేలా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అందుకు 'బాహుబలి' సినిమానే ఒక ఉదాహరణ. ఈ సినిమాలో కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుందని వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌లో ఎందరో అద్భుతమైన నటులు, డ్యాన్సర్లు ఉన్నారు. రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజలాంటివారితో నటించేటప్పుడు మీ శరీరంలో ఎముకలు లేవా అంటూ జోక్ చేసానని చెప్పారు. సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, మునుపటి కంటే పరిస్థితులు చాలా మెరుగయ్యాయని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు