అమ్మాయిని బలవంతం చేసి లొంగదీసుకున్న దాఖలాలు లేవు : రాంగోపాల్ వర్మ

ఆదివారం, 21 అక్టోబరు 2018 (17:06 IST)
ఒక అమ్మాయిని బలవంతం చేసి లొంగదీసుకుని అనుభవించిన దాఖలాలు ఇప్పటివరకు వరకు లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం ఓ పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను శృంగార ఛాయా చిత్రాలుగా (సెక్స్ సింబల్స్) చూస్తారన్నది కేవలం తన అభిప్రాయం మాత్రమేనని చెప్పారు.
 
ఏదేని ఒక లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు స్త్రీ, పురుష సంబంధం ఉండదన్నారు. తన జీవితంలో ఏ ఆర్టిస్టునూ కూడా దేనికీ ఫోర్స్ చేయలేదని, ఒక అమ్మాయిని బలవంతం చేయడం, ఆమెతో తప్పుగా ప్రవర్తించడం ఇంతవరకూ జరగలేదని వర్మ వివరించారు. 
 
అదేసమయంలో స్త్రీ తలచుకుంటే ఏమైనా సాధిస్తుందని, ఆ స్త్రీకి ఉన్న మహాశక్తి ఆకర్షణేనని, మగవాళ్లకు దాన్ని దేవుడు ఇవ్వలేదన్నారు. స్త్రీలు అందంగా ఉంటారు కాబట్టే తాను పొగుడుతానే తప్ప, వారిని కించపరచాలన్న ఉద్దేశంతో తన వ్యాఖ్యలు ఉండవని, వారిని తక్కువ దృష్టితో తాను ఎన్నడూ చూడలేదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు