ఎన్టీఆర్‌ని పెర్ఫార్మర్ అని, మహేష్ బాబును స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్ స్టార్‌గా కేటీఆర్ అభివర్ణించారు. ప్రభాస్‌ను బాహుబలి అని చెప్పుకొచ్చారు. మెట్రో రైలు చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఓ నెటిజన్ ప్రశ్నకు మిగతా మెట్రోలు, ఏసీ బస్సు టికెట్లతో సమానంగా ఉన్నాయని తెలిపారు.
రాహుల్ ద్రావిడ్, కోహ్లీ, రోహిత్‌శర్మ తన అభిమాన క్రికెటర్లుగా తెలిపిన ఐటీ మంత్రి… షారుఖ్ ఖాన్ తమ అభిమాన బాలీవుడ్ నటుడున్నారు. కేసీఆర్ కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాను అధికంగా ఇష్టపడే నేత అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.