ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించిన వివరణను యూట్యూబ్‌లో పోస్టు చేశానని వర్మ తెలిపాడు. ఈ వ్యవహారంపై ఎవరికైనా ఆసక్తి ఉంటే తన వీడియోను చూసుకోవచ్చని వర్మ సమాధానం ఇచ్చారు. తాను ఎన్నడూ దేనికీ కూడా విచారాన్ని వ్యక్తం చేయబోనని, ముందుకు వెళుతూ ఉండటమే తన కర్తవ్యమని తెలిపారు.
అలాగే వర్మ కామెంట్లతో తాను ఫీల్ అయినట్టు పూరీ జగన్నాథ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కామెంట్లు చేయడం తన హక్కు అని, ఫీల్ కావడం పూరీ హక్కని తెలిపాడు. తాను చెప్పేవాటిని అర్థం చేసుకోలేని వాళ్లే తనను సైకో అంటారని వర్మ చెప్పుకొచ్చాడు. అయినా వాటిని పెద్దగా పట్టించుకోనని వర్మ తేల్చి చెప్పాడు.