సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రౌడీయిజం, రాజకీయాలు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ముందు నుంచి చెబుతున్నారు. అయితే, సినిమా విషయంలో వంగవీటి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సీన్ సీరియస్ అయ్యింది. దీంతో శనివారం వర్మ - వంగవీటి రాధా కుటుంబ సభ్యులతో జరిగిన చర్చలు ఫలించలేదు. ఎవరికి వారు తగ్గేది లేదని తేల్చిచెప్పారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. "నేను దర్శకుడిని కాకముందు నుంచి నాకు ఈ కథ గురించి తెలుసు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా"నన్నారు. ఈ చిత్రానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నట్టుగానే చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.