మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలు, మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠత మరియు అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను పెంపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు అంటూ చరణ్ తెలిపారు.
అఖిల భారత చిరంజీవి యువత -రవణం స్వామినాయుడు మాట్లాడుతూ, అన్నయ్యా..
1978 సెప్టెంబర్ 22న ప్రాణంఖరీదు సినిమాతో సినీ బడిలో ఓనమాలు దిద్ది.. ఇంతై.. ఇంతింతై అన్నట్టు కొనసాగిన మీ నటప్రస్థానం నేటితో 45ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయం. శిఖరమంత ఎత్తులో ఉన్నా తొలిరోజు నిబద్ధత, క్రమశిక్షణ, వినమ్రతే ఇప్పటికీ మీలో చూస్తున్నాం. ఇవే మీకు ఆభరణాలు. ఇన్నేళ్ల ప్రస్థానంలో మీరు ఎదిగారు.. తెలుగు సినిమా వైభోగం పెంచారు.. ఎందరికో ఆదర్శమయ్యారు. తరాలు మారుతున్నా మీపై ఇష్టం పెరిగేలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం మీ ప్రత్యేకత. సినిమా కోసం ఇప్పటికీ మీరు కష్టాన్ని ఇష్టంగా చేసుకోవడం.. మీపై తెలుగు ప్రేక్షకులు చూపే తరగని అభిమానానికి కారణం.