అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! అని మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అన్నారు. ఈ సారి ప్రత్యేకత ఏమంటే చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం. కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాళ్లు తో సందడిగా పూజ జరుపుకున్నారు.