దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వై.యస్ జగన్‌మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం ‘‘ వ్యూహం’’. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ‘‘వ్యూహం’’ సినిమా గురించి ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తానికి రీ– సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన ట్వీట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపారు.