రజనీకాంత్, రమ్యకృష్ణ కాంబోలో వచ్చిన నరసింహ సినిమా ప్రేక్షకులను బాగా అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ జంట మళ్ళీ తెరపై సందడి చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రోబో 2.0 సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో ఓ కీలక రోల్‌లో రమ్యకృష్ణను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిసింది. ఇంకా అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలిసింది.
ప్రస్తుతం రజనీకాంత్ లేని కొన్ని సన్నివేశాలను తలకోనలో చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ ఆగస్ట్ షెడ్యూల్‌లో ఉంటుంది. అదే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ జాయిన్ కానుందని సినీ యూనిట్ అంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.