తాజాగా, రానా పోస్టు చేసిన ఫొటోల్లో ఆయన పంచెకట్టులో, మిహీకా పట్టుచీరలో కనపడ్డారు. ఈ రోజు రానా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే వారి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది.
ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా కొద్ది కుటుంబ సభ్యుల మధ్య వారి నిశ్చితార్థం జరిగినట్లు టాక్. కాగా, వారి పెళ్లి డిసెంబరులో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సురేష్ బాబు తెలిపారు.