సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు. అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కథను నడిపించడంలో ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్రను పోషించనుందట. ‘‘సుబ్రహ్మణ్యపురం’’ కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది. దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.
కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? ‘‘సుబ్రహ్మణ్యపురం’’లో దాగున్న రహాస్యం ఏంటి..? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన చిత్రం ‘‘సుబ్రహ్మణ్యపురం’’. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘‘సుబ్రహ్మణ్యపురం’’ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్‌లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘‘సుబ్రహ్మణ్యపురం’’కు వర్క్ చేసారు. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్‌గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ మూవీ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.