రాశీ ఖన్నా చెప్పిన మనసులో మాటలు, ఆమె మాటల్లోనే... నేను వెంకీ సర్ నటించిన సినిమాలు చిన్నప్పటి నుండి చూసేదాన్ని. టీవీలో డబ్బింగ్ సినిమాలు వచ్చేవి. అప్పటి నుండే ఆయన సినిమాలు తెలుసు. కానీ నేను ఆయన స్టార్‌గా కన్నా మంచి మనిషిగా నాకు తెలుసు. అందుకే నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని.
వెంకీ మామ, ప్రతి రోజు పండగే... నేను నటించని ఈ రెండు సినిమాలు వారం రోజుల తేడాలో రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి 2 సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నంత మాత్రాన నాకేం ప్రెజర్ లేదు. యాక్టింగ్ విషయంలో కూడా పెద్దగా డిఫెరెన్స్ అనిపించలేదు. ఒక్క వరల్డ్ ఫేమస్ లవర్ కోసమే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అది చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్.