ఐటెం సాంగ్స్ ఇబ్బందిగా ఉంటుంది... కానీ దాన్ని ఒప్పుకుంటా... రాశీఖన్నా

గురువారం, 17 నవంబరు 2016 (18:41 IST)
చాలామంది కథానాయికలు సినిమాల్లో ఐటంసాంగ్‌ చేయడానికి సిద్ధపడుతున్నారు. కానీ తనకు అది సూటూకాదని నటి రాశీఖన్నా తెలియజేస్తుంది. తాజాగా రవితేజ సినిమాలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయనీ.. మరో రెండు తమిళ చిత్రాల్లో నటించనున్నట్లు చెబుతోంది. షూటింగ్‌ విషయాలను చెబుతూ.. సెట్‌లో ఉంటే అందరినీ నవ్విస్తుంటాను. ఇటీవలే ఓ పాత్ర కోసం బరువు తగ్గాను. అలా తగ్గడానికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు కూడా ఒక కారణం అనొచ్చు. అలాగే బాలీవుడ్‌లోకి ఎంటర్‌ కావాలని ప్రయత్నాలు చేయడం లేదు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. 
 
ఏదో సక్సెస్‌ సాధించేయాలనో, ఎక్కువ సినిమాలు చేసేయాలనో టెన్షన్‌ పడను. తెలుగులో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే. అలాగే పీరియాడిక్‌ ఫిలింలో కూడా నటించాలని ఉంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తెలియజేసింది. డబ్బింగ్‌ గురించి చెబుతూ... నా పాత్రలకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉంది కానీ అంత సమయం ఉండటం లేదు. ఇక ఇప్పుడు చాలామంది హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఐటెం సాంగ్స్‌ చేయడానికి నేను అంత కంఫర్ట్‌గా ఫీల్‌కాను. ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. 
 
ఇక నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చూస్తే... నేను ఖాళీ సమయాల్లో క్రికెట్‌ ఆడతాను, బుక్స్‌ చదువుతుంటాను. సోషల్‌ యాక్టివిటీస్‌ కూడా చేస్తాను. అయితే వాటి గురించిన వివరాలు ఇప్పుడు చెప్పదలుచుకోవడం లేదు. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు, తెలుగులో రవితేజగారితో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.

వెబ్దునియా పై చదవండి