ఈ చిత్రంలోని "ఆ" సన్నివేశాలను చూసిన ఆమె ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కొద్ది రోజులుగా డిఫరెంట్ స్టైల్‌లో ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ట్రెండీగా, స్టైలిష్‌గా, రొమాంటిక్‌గా ఇలా డిఫరెంట్ స్టైల్‌లో రాశీ చేసిన రచ్చ సోషల్ మీడియాని షేక్ చేసింది.
ఈ క్రమంలో రాశీఖన్నా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. తాను ఇప్పటి వరకు ప్రేమ జోలికి పోలేదని చెబుతోంది. పైగా, భవిష్యత్‌లో ఎవరితోనైన ప్రేమలో పడితే డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని రాశీఖన్నా చెప్పుకొచ్చింది.