Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

దేవీ

గురువారం, 10 ఏప్రియల్ 2025 (17:04 IST)
Mas jatara song
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. తాజాగా తు మేరా లవర్ అంటూ టీజ్ చేస్తున్న రవితేజ సాంగ్ రాబోతోంది. ఏప్రిల్ 14న సాంగ్ విడుదలచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
 
రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్ గా మాస్ జాతర రూపొందుతోందని గ్లింప్స్ ను చూస్తే అర్థమవుతోంది. అలాగే ఈ సాంగ్ తో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది అత్యంత భారీ విందు కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు