ఇక ఈ చిత్రానికి చంటబ్బాయి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో రవితేజ డిటెక్టివ్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో రవితేజ కామెడీ తో అలరించబోతున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమా లో నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడికి జోడిగా నటిస్తున్న హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.