తాతయ్యా..‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవళ్లను, మనవరాళ్లను అడగండి? అంటూ వర్మ అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా కచ్చితంగా మనవళ్లు, మనవరాళ్ల కోసమే కానీ, పాత ఆలోచనా ధోరణిలో ఉండే తాతయ్యల కోసం కాదు.. జస్ట్ చిల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బస్సుపై ఉన్న''అర్జున్ రెడ్డి" పోస్టర్‌ను తొలగిస్తున్న వి.హనుమంతరావు ఫొటోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ.. మీ పార్టీ తాతయ్య అయిపోయిందన్నారు. వీహెచ్ పిల్ల చేష్టల ద్వారా ప్రజలు, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఓటు వెయ్యరని ఎద్దేవా చేశారు.