వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మకు మంచి మసాలా లభించింది. అర్జున్ రెడ్డి సినిమా లిప్ లాక్ సీన్లపై కాంగ్రెస్ నేత వీహెచ్ సీరియస్ కావడం, ఆ సినిమా హీరో అర్జున్ చిల్ తాతయ్య అంటూ కామెంట్ చేయడం.. ఆపై మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో పోస్టర్లను ఉపసంహరించుకోవడం.. చివరికి శుక్రవారం పూట ఆ సినిమా విడుదల కావడం జరిగిపోయాయి.
విజయ్ దేవర కొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ తరం హీరోలు తమ హీరోయిజాన్ని చూపించేందుకు సాంకేతికతపై ఆధారపడుతుండగా, అందుకు భిన్నంగా దేవరకొండ అర్జున్ రెడ్డిలో కనిపించారన్నారు. అంతేగాకుండా అర్జున్ రెడ్డి ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అమితాబ్‌లా మారతాడనీ, తెలంగాణలో తొలి మెగాస్టార్‌గా కొనసాగుతాడని కితాబిచ్చాడు.