జనసేన పార్టీ వచ్చే 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సహజంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత సదరు నాయకుడిని ఎవరైనా విమర్శిస్తూ వుంటారు. అలా కాకపోతే వ్యక్తిగత గొడవలుంటే పనిగట్టుకుని మరీ విమర్శలు లాగించేస్తుంటారు. కానీ ఎలాంటి వైరం లేకుండానే మాటల తూటాలు పేల్చుతుంటే ఏమనుకోవాలి? రాజకీయమా, వ్యక్తిగతమా.. అదేమోగానీ పవర్ స్టార్ ట్విట్టర్లో ఏదయినా కామెంట్ పెడితే చాలు రాంగోపాల్ వర్మ మాత్రం దానిపై స్పందించకుండా వుండలేకపోతున్నారు.
ఈమధ్య పవన్ కళ్యాణ్ తను చెట్లతో మాట్లాడుతాననీ, ప్రకృతిని పలుకరిస్తానంటూ పెట్టిన ట్వీట్లపై వర్మ సెటైర్లు విసిరాడు. అవును.. పవన్ కళ్యాణ్ దేవుడు... భద్రాద్రి రామన్న, యాదగిరిగుట్ట నరసింహస్వామి, తిరుమల వెంకటేశ్వరుడు ఫోటోలకు బదులు పవన్ కల్యాణ్ ఫోటో పెట్టుకోవాలి. ఆయన దేవుడు. అంటూ సెటైర్లు విసిరారు. దీనిపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఐతే జనం మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి రాజకీయంగా ఇంకా సీట్లు గెలవకపోయినా... ఓ ప్రతిపక్షంలా రాంగోపాల్ వర్మ తయారయ్యారంటూ నవ్వుకుంటున్నారు. మరి వర్మ ఇకనైనా తన ట్వీట్లను ఆపుతారో లేదో చూడాలి.