పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ట్రైలర్ లో కాలేజీకి వెళ్లే అమ్మాయి కిడ్నాప్ చేసి, ఏకాంత ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయాలని గూండాలు ప్లాన్ చేస్తారు. ఆమె వారి నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఆమెను తీవ్రంగా గాయపరుస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆమెకు పోరాటం తప్పా మరో మార్గం లేదు.
ఈ చిత్రానికి మిథున్ గంగోపాధ్యాయ సినిమాటోగ్రఫీ, మానిక్ దివార్ ఎడిటర్. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను సునీల్ రోడ్రిగ్స్ పర్యవేక్షించారు. ఇన్ కార్ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది.
తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్