అనుపమ-బుమ్రా ఇన్‌స్టాగ్రాంలో అన్‌ఫాలో చేసుకున్నారు: నటి తల్లి (Video)

శనివారం, 6 మార్చి 2021 (17:40 IST)
ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా- నటి అనుపమ పరమేశ్వరన్ రహస్య వివాహం అంటూ గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అనుపమ తల్లి స్పందించారు. మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలను ఖండించారు.
 
తన కుమార్తె అనుపమ, జస్‌ప్రీత్ బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమే అని చెప్పారు. బుమ్రాతో డేటింగ్ అంటూ వచ్చిన వార్తలను కూడా అనుపమా ఇంతకుముందు ఖండించగా, ఇలాంటి తప్పుడు పుకార్లు మళ్లీ ఎలా వస్తున్నాయని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
 
పుకార్లు వచ్చిన తర్వాత ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని అనుపమా తల్లి తెలిపింది. అనుమపమ, జస్‌ప్రీత్‌ల మధ్య స్నేహాన్ని ఇష్టపడని వ్యక్తులు ఇలాంటి అవాస్తవ కథలను సృష్టించారని ఆమె చెప్పారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు