అనుపమ కోసం నిఖిల్ పట్టు... సెలెక్ట్ చేసిన నిర్మాణ సంస్థ!

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:27 IST)
గతంలో యంగ్ హీరో నిఖిల్ నటించిన చిత్రం కార్తికేయ. ఈ చిత్రం రెండో భాగం నిర్మితంకానుంది. ఈ సీక్వెల్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్ కావాలని నిఖిల్ పట్టుబట్టాడట. అందుకే ఆమెకు అవకాశం కల్పించారు. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో "18 పేజెస్" పేరుతో  తెరకెక్కనుంది. ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది. 
 
కాగా, టాలీవుడ్ వెండితెరకు "అఆ" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు