బైక్ రైడింగ్ గురించి చెబుతూ, నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది అని చెప్పారు. ఆయన నటించిన `ఇదే మా కథ సినిమా కూడా బైక్ రైడింగ్ నేపథ్యంలో సాగుతంది. ఇందులో నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొన్నారు.