కన్నడలో పోలీస్ స్టోరీ తరువాత అగ్ని ఐపీఎస్, కుంకుమ భాగ్య, పోలీస్ స్టోరీ 2, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ జైల్, మనే మనే రామాయణ తదితర చిత్రాలు బాక్సాఫీస్ ని కొల్లగొట్టాయి. ఇక తెలుగులో అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వర్ అల్లా, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, సుప్రీం, చుట్టాలబ్బాయి, జనతా గారేజ్, మనలో ఒకడు, ఓం నమో వెంకటేశాయ, జై లవకుశ, రాజా ది గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, ఎస్ ఆర్ కళ్యాణమండపం, దసరా, సార్, ఇలా ఎన్నెన్నో చిత్రాల్లో నటించి మంచి పేరుని సంపాదించుకున్నారు.
2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానం చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్సార్-టీవీ 9 అవార్డును అందుకున్నారు.
ఇక వెండితెరపైనే కాకుండా మాంచి కిక్కిచ్చే గేమ్ షో అంటూ బుల్లితెరపై వావ్ అనిపించుకున్నారు సాయి కుమార్. ప్రస్తుతం సాయి కుమార్ ఓ సినిమాలో నటిస్తే అది బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది. గత ఏడాది సాయి కుమార్ నటించిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు సాయి కుమార్ ఇండస్ట్రీలో అందరికీ లక్కీ హ్యాండ్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో సాయి కుమార్ ముందుంటారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తి అయినా కూడా లెక్కకు మించిన ప్రాజెక్టుల్లో భాగం అవుతూ బిజీగా ఉండటం ఒక్క సాయి కుమార్‌కే చెందింది. ఇక ఆయన కుమారుడిగా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ సైతం చేతినిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సాయి కుమార్ మున్ముందు మరిన్ని చిత్రాలు, మంచి పాత్రలతో ఆడియెన్స్‌ను అలరిస్తూ ఉండాలని కోరుకుందాం.