ఇటీవలే యాక్సిండెట్‌కు గురయి ప్రజల ఆశీస్సులతో బయటకు వచ్చిన సాయి దరమ్‌తేజ్ సినిమా ఫంక్షన్లకు రావడం లేదు. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న సాయితేజ్ ఈరోజు రాత్రి జరిగిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ట్రైలర్ లాంఛ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను ముఖ్యంగా మహిళా అభిమానులు, యూత్ పెండ్లి గురించి అడిగారు. వెంటనే సాయితేజ్ స్పందిస్తూ, కుర్రకారుని ఉద్దేశించి.. ముందు ఆడవాళ్ళను గౌరవించడం నేర్చుకోండి. అప్పుడు పెండ్లి చేసుకుంటా అంటూ నవ్వుతూ బదులిచ్చారు.