దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పినప్పుడు నేను చేయనని చెప్పేశా. కానీ ఫోన్ లో మీరు చేయాలని అన్నారు. ముందు మీరు కథ వినండి. అవసరమైతే చెన్నై వచ్చి చెబుతానన్నాడు. నేను హైదరాబాద్ పనిమీద వచ్చినప్పుడు సలార్ ఆఫీస్ లో కథ విన్నాను. నాకు నచ్చలేదు. హీరో ఎవరనేది చెప్పలేదు. హీరోని మర్చిపోండి. అక్కడ ఎవరున్నా మీరు పాత్ర చేయాలి. మేరే కరెక్ట్ అన్నారు. అసలు ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడని నాకు చెప్పలేదు. అని శ్రియారెడ్డి అన్నారు.
ఇక షూటింగ్ వెళ్లేవరకు నాకు పాత్ర మీద పెద్ద ఆసక్తిలేదు. చివరి నముషంలోనూ కాన్సిల్ చేద్దామని దర్శకుడికి చెప్పా. ఆయన పట్టుబట్టి నాతో పాత్ర వేయించారు. ఇప్పుడు ఆ పాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలిగింది. నా పదేళ్ళ గేప్ ఒక్కసారిగా మర్చిపోయేలా చేసింది. ఇక షూటింగ్ లో ప్రభాస్ నా జట్టు గురించి, నా కళ్ళు గురించి మాట్లాడారు. జుట్టు ఒరిజినలేనా? అంటూ అడిగాడు. అంటూ పలు విషయాలు షేర్ చేసింది. తాజాగా సలార్ సక్సెస్ తో పలు సినిమాల ఆపర్లు వస్తున్నాయట. కానీ దేనిని అంగీకరించలేదని చెప్పింది.