ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండాలి : సల్మాన్ ఖాన్

శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (15:55 IST)
ఓటీటీ ఫ్లాట్‌ఫాం విస్తృతి పెరిగిపోయింది. దీంతో ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండాలని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అశ్లీలత మోతాదు ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో థియేటర్ల మాదిరిగానే ఓటీటీలకూ సెన్సార్‌బోర్డ్‌ ఉండాలని ఆయన చెప్పాకొచ్చారు. మన దేశంలోని నియమ నిబంధలను పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 
 
ఫిలింఫేర్‌ అవార్డుల ఆరంభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, 'ఓటీటీకి కూడా సెన్సార్‌ ఉండాలి. ఓటీటీ వేదికగా పెరుగుతోన్న అశ్లీల, అసభ్య కంటెంట్‌ను నిలిపివేయాలి. 15 ఏళ్ల వయసు పిల్లలూ వాటిని చూసే అవకాశం ఉంది. ఒకవేళ మీ పిల్లలే ఇలాంటివి చూస్తే మీరు అంగీకరిస్తారా? కాబట్టి ఓటీటీలోకి వచ్చే కంటెంట్‌పై పర్యవేక్షణ ఉండాలి. కంటెంట్‌ ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ ప్రేక్షకాదరణ లభిస్తుంది' అని సల్మాన్‌ పేర్కొన్నారు.
 
అనంతరం ఆయన ఇలాంటి అశ్లీల కంటెంట్‌లో నటిస్తోన్న వారిని ఉద్దేశిస్తూ.. 'ఒకవేళ మీరే కనుక మితిమీరిన రొమాన్స్‌, ఎక్స్‌పోజింగ్‌, ముద్దు సన్నివేశాల్లో నటిస్తే.. ఆ దృశ్యాలను మీ ఇంట్లో పనిచేసేవాళ్లు కూడా చూస్తారు. దాని వల్ల మీ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి, హద్దులు దాటిల్సిన అవసరం లేదు. మనం భారతదేశంలో నివసిస్తున్నాం. గతంలో ఇలాంటివి వచ్చి ఉండొచ్చు. కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ మంచి కంటెంట్‌ను అందించడం కోసం వర్క్‌ చేస్తున్నారు' అని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు