సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్పులో వున్న సంగతి తెలిసిందే. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ఎప్పటికప్పడు తన సమాచారాన్ని షేర్ చేస్తుంటుంది. తనకు నచ్చిన దుస్తులను ధరించడమే కాకుండా... ఆ దుస్తులను సోషల్ మీడియాలో పెట్టడం.. వాటిపై నెటిజన్లు కామెంట్ చేస్తూ.. సమంతని ట్రోలింగ్ చేయడం తెలిసిందే. మళ్లీ అలాంటి సంఘటనే జరిగింది. యూ టర్న్, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు సక్సెస్ సాధించిన నేపధ్యంలో చైతన్య, సమంత కలిసి హాలీడేకి వెళ్లారు.
హాలీడే ట్రిప్‌లో తీసుకున్న ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఓ ఫోటో అభిమానులకు కాస్త ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. రెడ్ కలర్‌లో ఉన్న పొట్టి దుస్తులను వేసుకొని దిగిన ఫోటోను షేర్ చేయడంతో సమంతపై ట్రోలింగ్ మొదలైంది. ఈ విషయంలో సమంత అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగుతున్నారు.
కొందరు సమంతకు సపోర్ట్‌గా కామెంట్‌లు పెట్టగా, మరికొందరు నెగెటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. కొందరు లేడీ ఫ్యాన్స్ సైతం సమంత వేసుకున్న డ్రెస్ బాగోలేదంటూ, తన నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. అక్కినేని గారు చనిపోయి బతికిపోయారు. ఆయన బతికుంటే సమంత చేస్తోన్న చేష్టలకు చాలా బాధపడేవారంటున్నారు.