బికినీలో సమంత: విమర్శించిన వారికి కౌంటరిచ్చింది.. దుస్తుల్ని బట్టి?

బుధవారం, 31 మే 2017 (14:46 IST)
దక్షిణాది తార సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేస్తూ... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఈ క్రమంలో తన బికినీ ఫోటోపై విమర్శలు చేసిన వారిపై సమంత మండిపడింది. సమంత తన బాయ్ ఫ్రెండ్ నాగచైతన్యను త్వరలో పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో వీరిద్దరి ప్రేమపెళ్లి జరుగనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో విజయ్, విశాల్, విజయ్ సేతుపతి, శివకార్తీకేయన్‌లతో సినిమా చేస్తున్న సమంత, తెలుగులో నాగార్జునతో రాజుగారి గది, రామ్ చరణ్‌తో మరో సినిమాల్లో నటిస్తోంది. అంతేగాకుండా.. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న అలనాటి నటి సావిత్రి బయోపిక్‌లోనూ నటిస్తోంది. సినీ షూటింగ్‌‍ల్లో బిజీ బిజీగా ఉంటున్న సమంత.. కాస్త విరామం దొరికితే విదేశాలకు ఎగిరిపోతుంది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల్లో తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇందులో ఓ బికినీ ఫోటో కూడా ఉంది. 
 
నాగార్జున కోడలు కానున్న సమంత ఇలాంటి దుస్తులతో కనిపించడంపై నెటిజన్లు సమంతను ఏకిపారేశారు. అంతేగాకుండా సమంతను విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ ట్వీట్లను చూసి సమంత షాక్ తింది. ఇంకా తనపై విమర్శలు గుప్పించే వారికి కౌంటరిచ్చింది. ఓ మహిళ ధరించే దుస్తులను బట్టే.. ఆ మహిళ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారా? మీ బుద్ధిని తలచి సిగ్గుపడుతున్నాననంటూ.. ట్వీట్ చేసింది. సమ్మూ ట్వీట్‌తో నెటిజన్లు సైలెంట్ అయిపోయారు. ఇంకా సమ్మూపై విమర్శలు గుప్పించిన వ్యక్తి పట్ల సమ్మూ ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. 
 
ఇకపోతే... సమంత-నాగచైతన్య పెళ్ళి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న చైతూ.. సమంతతో అక్టోబర్‌లో వివాహానికి రెడీ అవుతున్నాడు. పెళ్ళికి తర్వాత కూడా సమంత నటించనుంది.

వెబ్దునియా పై చదవండి