ఈ పుస్తకాన్ని ఆమె చదవడమే కాదు... మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి అంటూ ట్విట్టర్లో సెలవిస్తోంది. కొన్ని వ్యతిరేక భావాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పిన సమంత, ఈ పుస్తకం చదివితే ఉగ్రవాద శక్తులపై పోరాడేందుకు బాగా పనికి వస్తుందంటూ కామెంట్ పెట్టింది. మరి ఈ పుస్తకాన్ని ఎంతమంది చదువుతారో?