దక్షిణాది హీరోయిన్‌గా అగ్రస్థానంలో ఉన్న సమంత కొత్త అవతారం ఎత్తనుంది. జర్నలిస్టు పాత్రలో అమ్మడు ప్రేక్షకులను మెప్పించనుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. హీరోయిన్‌గా ఇన్నాళ్లు అందాలు ఆరబోస్తూ గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకునే పనుల్లో పడింది.
తెలుగులో ఏ మాయ చేసావె సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సమంత ప్రస్తుతం బిజీ బిజీ అవకాశాలతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇటీవలే ‘24’తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన సమంత ప్రస్తుతం ‘అ ఆ, బ్రహ్మోత్సవం’ వంటి క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సమంత కొత్త సినిమా కోసం సంతకాలు చేసింది.