నన్ను అలా చూసి చైతూ ఏడ్చేశాడు.. మణిరత్నం సినిమాలో నటించాలన్నదే డ్రీమ్: సమంత

గురువారం, 22 డిశెంబరు 2016 (11:53 IST)
ఫేస్ బుక్ లైవ్ చాట్‌లో సమంత తొలిసారిగా ఫ్యాన్స్‌ను పలకరించింది. ఏ మాయ చేశావే సినిమాలో అరంగేట్రం చేసిన సమంతకు తొలి సినిమాతోనే అక్కినేని నాగేశ్వరరావు అంతటి నటుడి నుంచి ప్రశంసలు అందాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో విజయ్ తెరిలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి లైవ్ చాట్‌లో ఓ అభిమాని మాట్లాడాడు. ఆ సినిమాతో అందరినీ ఏడిపించారు కదా అని ప్రశ్నించాడు.
 
ఇందుకు సమంత స్పందిస్తూ.. దర్శకుడు అట్లీ ఆ సీన్ గురించి చెప్పినప్పుడే, థియేటర్లో అందరినీ ఏడ్చేలా చేస్తానని చెప్పాను. నిజంగా అదే జరిగింది. అది తన విజయంగానే భావిస్తున్నానని.. ఆ సినిమా చూసేందుకు తన స్నేహితులు, చైతూతో కలిసి థియేటర్‌కి వెళ్లాను. ఆ సీన్‌ వస్తున్నపుడు స్ర్కీన్‌ వైపు కాకుండా థియేటర్‌లో ఉన్న జనాల వైపు చూస్తూ కూర్చున్నా.
 
ఆ సీన్‌ వస్తున్నపుడు అందరూ భావోద్వేగంతో ఉన్నారు. తన పక్కనే కూర్చున్న చైతూ కూడా ఆ సన్నివేశంలో తనను అలా చూసి ఏడ్చేశాడు. ఈ  సీన్‌లో అందరినీ ఏడ్పించాననని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి సినిమాలు అంగీకరించలేదని, అయితే మణిరత్నం సినిమాలో నటించాలన్నది తన కలని సమంత వెల్లడించింది. అలాగే మహానటి సావిత్రి బయోపిక్‌లో నటించాలనుందని సమంత మనసులోని మాటను బయటపెట్టింది. 

వెబ్దునియా పై చదవండి