సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకం పై ప్రొడక్షన్ నం.14 గా రూపొందుతున్న చిత్రం యశోద. జంట దర్శకులు హరి-హరీష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ ను ఈరోజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ-ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత కు పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు వచ్చింది. దాన్ని దృష్టి లో పెట్టుకుని ఆమె స్థాయి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా చేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే సమంత యశోద పాత్ర విషయంలో కనబరిచిన డెడికేషన్, పాత్రను సొంతం చేసుకున్న తీరు ఎక్సలెంట్. సమంత నటన చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఆఖరి షెడ్యులు చేస్తున్నాం. జూన్ మొదటి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్ లో కోడైకెనాల్ లో క్లైమాక్స్ తీశాం. ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యం లో ప్రదాన తారాగణం పై ఈ క్లైమాక్స్ చిత్రీకరించాం. ఈ సినిమాలో స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. జంట దర్శకులు హరి-హరీష్ సినిమాని తీర్చి దిద్దుతున్న తీరు ఇంప్రెసివ్ గా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న భారీ ఎత్తున విడుదల చేయనున్నాం అని చెప్పారు.