సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

ఠాగూర్

గురువారం, 23 జనవరి 2025 (14:28 IST)
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ నెల 14వ తేదీన విడుదలైన ఘన విజయం సాధించింది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం జబర్దస్త్ స్కిట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీనిపై ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. 
 
"నా ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నా ప్రతి సినిమాకు ఇలాంటి కామెంట్స్ విని విసిగిపోయాను. కానీ నా సినిమాలకు ప్రేక్షకులు ఘనవిజయాన్ని అందించారు. ఎవరో 'ఒకరిద్దరూ చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం" అని అన్నారు.
 
"ఆడియన్స్ సపోర్ట్ ఇప్పటివరకు నా కెరీర్లో నిరాశజనకమైన రోజులను చూడలేదు. వాళ్లు నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆదరించారు. వాళ్ల ఆదరణతో నా కెరీర్‌లో అన్నీ మంచి రోజులు, సంతోషకరమైన రోజులే చూశాను" అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. 
 
దర్శకుడి కావాలనే తన కోరిక 'పటాస్'తో తీరిందని, ఇప్పుడు అంతా బోనస్‌గా భావిస్తున్నానని, చిరంజీవితో ఓ ఎంటర్టైనర్ సినిమా చేయాలనుందని, నాగార్జునతో 'హలో బ్రదర్' లాంటి సినిమా తీయాలనుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు