ఇటీవల ఒక యువ జంట థియేటర్ లోపల ఈ పాటకు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ జంట తమ సీట్ల ముందు ఉన్న చిన్న స్థలాన్ని ఉపయోగించుకున్నారు. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ పాటకు అచ్చం అలాంటి స్టెప్పులతో డ్యాన్స్ చేశారు.
జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం సానుకూల సమీక్షలను అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.