అలాగే సంక్రాంతికి తెలుగు సినిమాతోపాటు తమిళ డబ్బింగ్ కూడా విడుదలయ్యేవి. రజనీకాంత్, అజిత్, విజయ్ ఇలా వారి సినిమాలు విడుదలయి బాగానేఆడేవి. కానీ రానురాను పెద్ద హీరోల చిత్రాలపై విమర్శలు రావడంతో చిన్న నిర్మాతలు తమ సినిమాలు విడుదలచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మరలా పాత పద్ధతిలోనే తెలుగు సినిమా పయనిస్తోంది. ఇందుకు నిదర్శనం బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ సంక్రాంతికి విడుదలకావడమే.
వీరిద్దరి సినిమాల వల్ల మిగతా ఏ సినిమాలు విడుదలకు నోచుకోలేకపోతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. మూడో సినిమాగా దిల్‌రాజు నిర్మానంలో వస్తున్న తమిళ విజయ్ వారసుడు రాబోతుంది. ఇది పక్కా డబ్బింగ్ సినిమా అనీ, కాదు ఇది స్ట్రెయిట్ సినిమా అని నిర్మాత దిల్‌రాజు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ షూటింగ్ బంద్ పాటిస్తున్నప్పడు రెండు రకాలుగా వ్యవహించాడు. ఇక ఈసారి సంక్రాంతి సినిమాలకు ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే..