సంక్రాంతి పండుగకు ముందే తెలుగు ప్రేక్షకులకు నిజమైన సినిమా పండుగ వచ్చేసింది. వరుసగా 9వ తేదీ నుంచి నాలుగు సినిమాలు విడుదలవడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 9వ తేదీ విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా భారీ విజయం వైపు దూసుకువెళుతోంది. ఇక 10వ తేదీ విడుదలైన రజినీ పేట సినిమా కూడా హిట్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
కానీ 11వ తేదీ రిలీజైన్ వినయ విధేయ రామ సినిమా మాత్రం భారీ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో రాంచరణ్ నటించారు. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు రోజుల్లో 8 కోట్ల రూపాయల భారీ కలెక్షన్‌ను సంపాదించింది. ఇక ఎన్టీఆర్ సినిమా అయితే మూడు రోజుల్లో 7.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం 30 లక్షల రూపాయల వ్యత్యాసం మాత్రమే. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కన్నా వినయ విధేయ రామ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు.
మరోవైపు ఇవాళే విడుదలైన ఎఫ్2 చిత్రం హాస్యం మేళవింపుతో సంక్రాంతి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. మొత్తమ్మీద ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో ఓ ఆట ఆడుకుంటున్నాయి.