నిర్మాత సతీష్ మాట్లాడుతూ: తెలుగువాడిని అయిన నేను చెన్నైలో స్థిరపడ్డాను.. శివకి సినీమా చూపించాను.. వెంటనే అన్న ఈ సినీమా నేను తెలుగులో రిలీజ్ చేస్తాను అని చెప్పారు, నిజానికి ఇలా నాతో చాలా మంది అన్నారు శివ కూడా అలానే అనుకున్నాను కాని సినిమా రిలీజ్ అప్పుడు వచ్చి స్టేజి మీద ఈ సినిమాని తెలుగులో మేము రిలీజ్ చేస్తున్నాం అన్నారు, అప్పుడు శివ సీరియస్ గానే అన్నాడని అర్ధమైంది.. ఆ తరవాత ఇదిగోండి ఈరోజు ఇలా ఉన్నాం.. హమరేష్ "విక్రమ్: హరోగా చేసిన "నాన్న" మూవీ లవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా, లోకేష్ కనగరాజ్ నగరంలో, ప్రియదర్శి గారు దర్శకత్వంలో సినిమాలు చేశాడు. అప్పుడు హమరేష్ లో ఉన్న passion నాకు అర్ధం కాలేదు, పోను పోను తను పెట్టె ఎఫర్ట్ అర్ధమై, గోపురం ప్రొడక్షన్స్ లో రంగోలి పేరుతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం, పెద్ద సక్సెస్ అయ్యింది.. అందుకే అందరం సపోర్ట్ చేస్తున్నాం.. తెలుగు ఇండస్ట్రీ చాలా మందిని ఆదరించింది, అలాగే అమారేష్ నీ కూడా ఆదరిస్తుంది అనుకుంటున్నాను. అన్నారు.