సి.కె. స్క్రీన్స్ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ నిర్మాత సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, కిశోర్ కీలక పాత్రధారులు. సత్యదేవ్, గోపిగణేష్ పట్టాభి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'బ్లఫ్ మాస్టర్' చిత్రం ఇటు ప్రేక్షకుల ఆదరణను, అటు విమర్శకుల ప్రశంసలను అమితంగా పొందింది. అలాంటి క్లాసిక్ మూవీ తర్వాత ఈసారి వారు యాక్షన్ థ్రిల్లర్ 'గాడ్సే'తో అలరించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ మూవీలో సత్యదేవ్ చాలా పవర్‌ఫుల్ రోల్ చేయనున్నట్లు చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. గన్స్‌తో, ఇంటెన్స్ లుక్స్‌తో ఆయన కనిపిస్తున్నారు. టైటిల్ డిజైన్‌లోనూ బుల్లెట్ కనిపిస్తుండటం బట్టి యాక్షన్‌కు ఈ మూవీలో కొదవ ఉండదని ఊహించవచ్చు. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్‌లో 'గాడ్సే'గా సత్యదేవ్ మనముందుకు రాబోతున్నారు.
దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను గోపిగణేష్ పట్టాభి అందిస్తున్న ఈ చిత్రానికి సి.వి. రావు సహ నిర్మాత. త్వరలో హీరోయిన్ పేరుతో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.