చాముండేశ్వరి: మా ఇంటిని చిన్న జూ లా అమ్మ వుంచేది. పక్షులు, చేపలు, కుందేలు, కుక్కలు, పిల్లులు పెంచేది. నాకు పాములంటే ఇష్టం. చిన్నప్పుడు పాములు ఆడించేవాడు వచ్చేవాడు. ఆ ఆటలో పాముతో అతను ఆడించడం కొత్తగా అనిపించేది. పామును ముట్టుకున్నారు. అందుకే వారం వారం అతను వచ్చేవాడు. ఇక పులిపిల్లలంటే కూడా ఇష్టం. కొడైకెనాల్ వెళ్ళినపపుడు అక్కడ రాజుగారి దగ్గర పులిపిల్లలు వుంటే ఇంటికి తెచ్చాను. ఆ తర్వాత నాన్న చూసి వాటిని తిరిగి పంపిచేలా చేశారు. ఎదుకంటే అవి పెద్దయితే నీ మాట వినవు అనేవారు.
సురేఖ మాట్లాడుతూ, మా నాన్నగారు కూడా దుస్తులు విషయంలో ఆంక్షలు పెట్టేవారు. మోడ్రన్ గా వుండాలని కోరిక వుండేది. కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. కొద్దికాలానికి ఆయన చెప్పింది కరెక్టే అనిపించేది అంటూ వివరించారు.