యాదృచ్చికంగానే జరిగినా లుంగీ కట్టుకుని డాన్స్ చేయటం అనేది షారూఖ్‌కి లక్ అనే చెప్పాలి. షారూక్‌ఖాన్ పవర్‌తో పాటు లుంగీ కూడా లక్ కూడా తోడైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేవలం షారూఖ్ మాత్రమే కాదు.. వెనుక ఉండే వెయ్యి మందికి పైగా బ్యాగ్రౌండ్ డాన్సర్స్ సైతం లుంగీ కట్టుకుని డాన్స్ చేయటం వల్ల పాటకు ఓ ప్రత్యేకమైన స్టైల్ క్రియేట్ అయ్యింది. ఈ పాటలో మరో అనుకోకుండా కలిసి వచ్చిన మరో విషయమేమంటే ఇందులో ప్రియమణి కూడా ఉండటం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ఆమె షారూఖ్‌తో కలిసి లుంగీ డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె కింగ్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు.
లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్‌కి మ్యూజిక్‌పై ఉన్న కనెక్షన్‌ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జవాన్ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న జవాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.